Samantha : విడాకుల తర్వాత సమంత నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తోంది. ఏదో ఒక విషయంపై సమంత స్పందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటోంది. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత సినిమాల్లో జోరు పెంచింది. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఓకే చెప్పింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేయనున్నారు.
కేవలం 5 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో నటించేందుకు సమంత కోటిన్నర రూపాయలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తోన్న చిత్ర యూనిట్ సమంత డిమాండ్ చేసినంతా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సినీ వర్గల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇన్నాళ్లు పద్దతిగా ఉన్న సమంత ఐటెం సాంగ్‌కి ఓకే అన్నందుకు ఆమెపై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. మరి తొలి సారి సమంత ఐటెం సాంగ్ చేస్తుండగా, ఈ పాటతో ఆకట్టుకుంటుందా.. లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…