Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. హౌజ్ మేట్స్ సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ అంటూ రెండు టీంలుగా విడిపోగా, ఒకరిపై ఒకరు ప్రతాపం చూపించుకుంటున్నారు. బుధవారం నాడు శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు టాస్కులు పూర్తి చేశారు. ఇక సూపర్ హీరోస్ టీం నుంచి ప్రియాంక వచ్చింది. ఆమెకు జ్యూస్‌లు తాగించి, పెయింట్స్ వేయించి, జుట్టు కూడా కత్తిరించుకోమని చెప్పారు. చివరి క్షణంలో సిరి వద్దని చెప్పింది.
విలన్ టీం వాళ్లు ఇచ్చిన టాస్క్‌లన్నీ పూర్తి చేసి తన టీంకి ఓ పాయింట్ తెచ్చిపెట్టింది ప్రియాంక. ఈ సారి హీరో టీం చాన్స్ రావడంతో వారు.. విలన్ టీం నుంచి ఆనీ మాస్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. రకరకాల డ్రింకులు ఇచ్చారు.. మిరపకాయ్ తినమని ఇచ్చారు.. పెయింట్ పూసుకోమ్మన్నారు. ఐస్ వాటర్ ఒంటి మీద పోసుకోమన్నారు. కాజల్ అయితే కాస్త పైశాచికం చూపించి పేడ కలిపింది. ఇలా ఎన్ని రకాలుగా చేసినా కూడా అనీ మాస్టర్ తట్టుకుంది. చివరి వరకు నిలబడి గెలిచింది.
ఇక సిరిపై షణ్ముఖ్ పదే పదే అరుస్తుండడంతో జెస్సీ.. ఆమె తరపున మాట్లాడాడు. అందరి ముందు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగాడు. దానికి సంచాలక్ కాబట్టి అలా అరిచాను అంటాడు, అది తప్పు అయితే నామినేట్ చేయండని అంటాడు. గుంజిళ్లు తీసింది మాత్రం చెప్పవా ?.. ప్రతీ అమ్మాయి దగ్గరకు వెళ్లి అలా చేస్తానా ? అంటూ సిరి, జెస్సీల మీద షన్ను ఫైర్ అవుతాడు. టాస్కుల్లో అయిన గాయాలకంటే.. నువ్ అనే మాటలే ఎక్కువగా బాధపెడుతున్నాయ్ అని సిరి ఏడ్చేసింది.
సిరి ఏడవడం గురించి మానస్‌తో డిస్కషన్ చేసింది ప్రియాంక. ఎవడు పెట్టుకోమన్నాడు, అంత గ్రీజు ఎందుకు అని సిరిపై సెటైర్లు వేసింది. దీంతో మానస్.. పింకీ, నీకు నోటిదూల ఎక్కువగా ఉంది, నిన్న నువ్వు ఏడ్చినప్పుడు కూడా అందరూ అలాగే అనుకుంటారు. నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు అని చెప్పుకొచ్చాడు. నీకు ఎవరైనా హాని చేయాలనుకుంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచనా విధానం అని చెప్పడంతో ప్రియాంక బాధపడి అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది.
ఇక సిరి గురించి కాజల్, షన్నులు మాట్లాడుకున్నారు. సిరి చాలా స్ట్రాంగ్.. టాస్కుల్లో బాగా ఆడుతుంది అని షన్ను అంటే.. సిరి రాడ్.. అని కాజల్ అంటుంది. బీభత్సమైన రాడ్ అంటూ సిరి గురించి కామెంట్ చేస్తాడు షన్ను. ఎప్పుడు కలిసే మేం ఆడతాం. ఈ సారి మాత్రం కావాలనే వేర్వేరుగా ఉన్నాం.. మేం కలిసి ఆడటం లేదు అని నిరూపించుకునేందుకు ఇలా వేర్వేరు టీంలలోకి వచ్చామని అంటాడు. అయితే టాస్క్ వలన సిరి, షణ్ముఖ్ మధ్య దూరం బాగానే పెరుగుతోంది.