Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 వారం వారం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. వారాంతాల్లో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఇక ఇందులో లోబో ఎలిమినేట్ అయ్యారు. ముందుగానే లీకులు రావడంతో.. వాటిల్లో చెప్పినట్లుగా.. ముందుగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. లోబో ఎలిమినేట్ అయ్యారు.
కాగా ఇప్పటి వరకు చూస్తే ఇంటి నుంచి అమ్మాయిలే ఎక్కువగా బయటకు వెళ్లారు. కానీ ఈ వారం ఉన్న కంటెస్టెంట్లలో లోబో అందరికన్నా తక్కువ ఓట్లు సంపాదించి ప్రత్యేక డేంజర్ జోన్ లో ఉండడమే కాకుండా.. ఇంట్లో వీక్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. దీంతో అతను ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ఇప్పటి వరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేత, ప్రియా ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే వారం వారం ఎంతో ఉత్సాహంగా ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఆదివారం పలువురు సెలబ్రిటీలు షోలో సందడి చేశారు.