T20 World Cup 2021 : న్యూజిలాండ్ చేతిలో భారత్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో భారత్ సెమీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఐసీసీ టోర్నీల్లో మొదటి రౌండ్‌లోనే వెను దిరగడం.. 2007 తరువాత ఇదే ప్రథమం. దీంతో అభిమానుల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సోషల్ మీడియాలో ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున #BanIPL అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
మొదటి మ్యాచ్‌నే ఓటమితో ప్రారంభించిన భారత్‌కు మొదట్లో అభిమానులు మద్దతుగానే నిలిచారు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లోనూ భారత ప్లేయర్ల ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఇంకా పాక్‌తో ఆడిన మ్యాచే నయం అనిపిస్తుంది. అందులో కొంత వరకు పోరాడారు. కానీ న్యూజిలాండ్‌తో మాత్రం మా వల్ల కాదు, అని పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత్‌ను కివీస్ చితక్కొట్టేసింది. ఈ క్రమంలో భారత్ మొదటి రౌండ్ ఆడి ఇంటికి రాక తప్పడం లేదు.
#BanIPL pic.twitter.com/l5m5exjzdR
— Aravind Jeni (@AravindJeni1) October 31, 2021
https://twitter.com/ArslanK97624701/status/1454864617381974019
#BanIPL pic.twitter.com/ZFy6DL7xab
— Ankit Singh🛡️ (@gautamsaksham78) October 31, 2021
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భారత జట్టు అత్యద్భుతంగా ఉందని, కప్ వస్తుందని, గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇచ్చింది టీమిండియా. పాక్‌తో ఓడిన తరువాత న్యూజిలాండ్‌తోనూ అదే ఆటతీరును ప్రదర్శించింది. అత్యంత బాధ్యతా రాహిత్యంగా ప్లేయర్లు మ్యాచ్‌లో ఆడారు. చెత్త షాట్లు ఆడి వికెట్లను అనవసరంగా పారేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఐపీఎల్‌ను బ్యాన్ చేయాల్సిందేనంటూ.. భారత ప్లేయర్లను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
I knew it…. #BanIPL https://t.co/TCz7w2lc1z
— Maya 🇮🇳 (@TheMehtaji) October 31, 2021
https://twitter.com/catharsiss__/status/1454864581151666178