Bigg Boss 5 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ అరుపులతో హోరెత్తి పోతుంది. ఒకరిపై ఒకరు దారుణంగా ఆరోపణలు, నిందలు వేసుకుంటూ నానా హంగామా సృష్టిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన నామినేషన్‌లో అలాంటివి ఏమీ లేవు. ఎమోషనల్‌గా ఎపిసోడ్ సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటి సభ్యులను పవర్ రూంకు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్ లో రెండు లేఖలు ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుందని చెబుతాడు.
లెటర్ అందుకున్నవారు సేవ్ కాగా, అందుకోని వారు నామినేషన్‌లో ఉంటారు. ముందుగా పవర్ రూంలోకి వెళ్లిన మానస్, శ్రీరామ్ లకు లోబో.. ప్రియాంక లేఖలు వచ్చాయి. ప్రియాంక కోసం తన లేఖను త్యాగం చేశాడు లోబో. ఆ తర్వాత షణ్ముఖ్, రవిలకు.. విశ్వ, సిరి లేఖలు అందాయి. ఇక విశ్వ కోసం తన లేఖను త్యాగం చేసింది సిరి. అనంతరం ప్రియాంక, కాజల్ కు అనీ మాస్టర్, మానస్ లేఖలు అందాయి. అనీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు
విశ్వ.. లోబోలకు రవి.. శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. ఇక రవి.. శ్రీరామ్ కోసం తన లేఖను త్యాగం చేశాడు. అనీ మాస్టర్, సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. కాజల్ కోసం షణ్ముఖ్ తన లేఖని త్యాగం చేశాడు. ఇలా నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగుతూ వచ్చింది. జెస్సీ కోసం శ్రీరామ్ త్యాగం చేశాడు. మొత్తం మీద ఈ వారం నామినేషన్ ప్రక్రియను హౌస్ మేట్స్ ఎమోషన్స్తో జత చేశాడు బిగ్ బాస్. ఈ వారం డేంజర్ జోన్‌లో లోబో, సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, రవి ఉన్నారు. ఇందులో లోబో లేదా సిరి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…