Samantha : తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారంటూ స్టార్ హీరోయిన్ సమంత కోర్టులో కొన్ని యూట్యూబ్ చానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుసార్లు విచారణ అనంతరం ఎట్టకేలకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పు సమంతకు ఊరట కలిగించేదే. అయినప్పటికీ ఆమె కూడా కోర్టు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
కాగా సమంతపై ప్రసారం చేసిన వీడియోల తాలూకు యూట్యూబ్ లింక్‌లను వెంటనే డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితానికి చెందిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయరాదని, కామెంట్స్ చేయరాదని.. ఇంజెక్షన్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి వెళ్లకూడదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే సమంత తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ కోర్టు ఆమెకు సూచించింది. సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.
కాగా నాగచైతన్యతో విడాకులు అని ప్రకటించినప్పటి నుంచి సమంతను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొన్ని చానల్స్ అయితే లేని పోని ఆరోపణలు చేశారు. తప్పంతా ఆమెదేనన్నట్లు చూపించారు. దీంతో మనస్థాపం చెందిన సమంత కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి పలు సార్లు కేసు విచారణను వాయిదా వేసి ఎట్టకేలకు తీర్పు చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…