Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ”భీమ్లా నాయక్”. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఇందులో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, రానా.. డానియల్ శేఖర్ అనే లోకల్ డాన్‌గా కనిపించనున్నాడు.
భీమ్లా నాయక్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్ వచ్చిందని , ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసిందని అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించారు. “భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో జనవరి 12 న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతోందని, ఓటీటీలో విడుదల కానుందని వచ్చే రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.
భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…