Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఒక్కొక్కరుగా బయటకు వస్తుండగా, ఈ వారం జస్వంత్ పడాల ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్‌లో లేకపోయినా అనారోగ్యం కారణంగా అతడిని ఎలిమినేట్ చేశారు.
అయితే అతనికి వారానికి రూ. 1.50 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పది వారాలకు గాను మొత్తం రూ.10 -15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు అంచనా.
ఓ వారం రోజులుగా జస్వంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని హౌస్ నుండి బయటికి పంపడమే ఉత్తమం అని బిగ్ బాస్ భావించారు. జస్వంత్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. అక్కడ పలు టెస్ట్‌లు చేయించాడు. పూర్తి వైద్యం తీసుకోవలసిన అవసరం అతనికి ఉందని ఎలిమినేట్ చేసి పంపారు. ఈ క్రమంలో కాజల్ సేవ్ అయింది.
సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీకి నిరాశే ఎదురైంది. అయితే జెస్సీ వెళ్లిపోయేముందు కంటెస్టెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు.
కాజల్‌ను.. అందరినీ నమ్మకు, నీ ఆట నువ్వు ఆడు.. అంటూ హెచ్చరించాడు. సిరికి ముద్దుల వర్షం కురిపించాడు. ఇక హౌజ్‌లో పిల్లాడిలా ఉన్న జెస్సీ బయటకు వచ్చాక మిస్టర్ మజ్నుగా మారాడు. అరియానాతో తెగ సందడి చేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…