Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సీజన్ 5 నడుస్తుండగా, ఈ సారి షో పెద్దగా ఎంటర్‌టైన్ చేయలేకపోతోంది. తెలిసిన ముఖాలు ఉన్నా కూడా గేమ్ రక్తి కట్టడం లేదు.
సీజన్ 4లో మోనాల్ , అఖిల్, సోహెల్ వంటి వారి వల్ల గేమ్ మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఈ సారి మాత్రం స్టఫ్ అనేది ఏమాత్రం లేదని అంటున్నారు. పాపులర్ ఫేసెస్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తారని ప్రచారం జరిగినా, అది కూడా లేదని తేలిపోయింది.
డిసెంబర్ 20న ఫైనల్ జరగనుండగా, ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకు రావడం అసంభవం. నాగార్జున అక్కినేని హోస్ట్ గా రూపొందుతున్న ఈ షో ఫైనల్ కోసం పెద్ద స్టార్‌నే పట్టుకు రావాలని ప్లాన్ చేస్తున్నాట. గతంలో చిరంజీవి, వెంకటేష్ వంటివారు సందడి చేయగా, ఈ సారి కొత్తగా ట్రై చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు రాక తప్పలేదు.
వారం రోజులుగా సీక్రెట్ రూంలోనే ఉన్న జెస్సీ కోలుకొని రీఎంట్రీ ఇస్తాడని భావించినా వర్టిగో వ్యాధి తీవ్రం అవుతుండటంతో బిగ్‌బాస్ షో మధ్యలోంచి అతను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గత వారం కాజల్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా.. ఆమె సేవ్ అయ్యింది. బదులుగా జెస్సీ బయటకు వచ్చాడు. అయితే ఫైనల్‌కి గెస్ట్‌గా ఎవరు వస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. ఆ సమయంలో అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్ విడుదల కానుంది.. కనుక అఖిల్ గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో సంక్రాంతి బరిలో ఉన్న మూవీలకు చెందిన స్టార్స్ లేదా దర్శకులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…