Bigg Boss 5 : ర‌వి కోసం వ‌చ్చిన సీజ‌న్ 1 విన్న‌ర్.. ఫ్ల‌యింగ్ కిస్‌లు పంపిన దీప్తి సున‌య‌న‌..

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. షో చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో హౌజ్‌మేట్స్ చాలా టెన్ష‌న్‌లో ఉన్నారు. అందుకే వారికి కాస్త ఉప‌శ‌మ‌నం పంచేందుకు కుటుంబ స‌భ్యుల‌ని ఇంట్లోకి పంపారు. ఇక శనివారం ఎపిసోడ్‌లో మ‌రి కొంత మంది కుటుంబ స‌భ్యులు వ‌చ్చారు. కాక‌పోతే వారు రావాలంటే ఏదో ఒక త్యాగం చేయాల్సి ఉంటుంద‌ని నాగ్ చెప్ప‌డంతో అంద‌రూ త‌మ‌కు విలువైన వ‌స్తువులను త్యాగాలు చేశారు.

Bigg Boss 5

ముందుగా రవి.. తన కూతురు గుర్తుగా ఉంచుకున్న డాల్‌ని త్యాగం చేశాడు. ఆ త్యాగానికి ఇంటి సభ్యులందరూ ఎస్ అని అనడంతో రవి కోసం వచ్చిన గెస్ట్‌ని కలుసుకునే అవకాశం లభించింది. రవి కోసం అతని తల్లి ఉమాదేవి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చారు. నువ్ రాజావిరా.. రాజ్ పుత్ రవి రాజా.. నా కొడుకు రవి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. నువ్ కన్నీళ్లు పెట్టుకోవద్దు.. అని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ కూడా రవి కోసం వచ్చాడు.

నువ్ చాలా మంచోడివి.. నీకోసం నువ్ పుట్టావ్.. ఎన్ని వచ్చినా తట్టుకుని ఈ స్టేజ్‌లో ఉన్నా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం వేరు.. బయట ఉండటం వేరు.. నువ్ ఎప్పుడూ వేరే వాళ్లకి సపోర్ట్‌గా మాట్లాడొద్దు.. పాయింట్ మాట్లాడేసి వచ్చేసెయ్.. మిగతాది జనం చూసుకుంటారు.. నువ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్.. అని చెప్పాడు.

తర్వాత పింకీ మేకప్‌ కిట్‌ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లను టాప్‌ 5లో ఉంచారు. సన్నీ తనకు ఫ్రెండ్స్‌ ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్‌ నిఖిల్‌, వెంకట్‌ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్‌ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు.

మానస్‌.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్‌ తండ్రి వెంకట్‌రావు, ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ వచ్చాడు. మానస్‌ను ఫస్ట్‌ ప్లేస్‌లో సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు.

కాజల్‌ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్‌ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్‌.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్‌, రవి, ప్రియాంక సింగ్‌, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్‌.. సన్నీ, షణ్ముఖ్‌, రవి, శ్రీరామ్‌, సిరిలు వరుసగా టాప్‌ 5లో ఉంటారన్నాడు.

చివరగా షణ్ముఖ్‌.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్‌ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM