Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం మరో రెండు వారాలలో ముగియనుంది. అయితే డైరెక్ట్‌గా ఫినాలే చేరుకునేందుకు టికెట్ టూ ఫినాలే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం హౌజ్ మేట్స్ చాలా రిస్కే చేస్తున్నారు. మొదటి లెవల్‌లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను లేపేయాలి. ఈ గేమ్‌లో సన్నీతో గొడవపడింది సిరి.
Bigg Boss 5 : రవి.. ఐ మిస్ యూ.. అంటూ సిరి ఏడ్చేయగా..
ఐస్ బకెట్ లో నుండి కాలు తీయలేదని సన్నీ వాదిస్తుండగా, సిరి మాత్రం తీశావు అంటూ అతనిపై చిర్రుబుర్రులాడింది. సన్నీ తన బాల్స్ తీయడానికి కాచుకుని కూర్చుండటంతో ఐస్ వాటర్‌లో నుంచి అడుగు బయట పెట్టలేదు సిరి. ఈ క్రమంలో రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

ఐస్‌లో అలాగే ఉండిపోయిన సిరికి కాళ్లు బిగుసుకుపోయాయి. అయితే మానస్ ఆమెకు సాయం అందించడంతో షణ్ముఖ్‌కి కోపం వచ్చింది. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది.
ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని వార్నింగ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేమీ పట్టించుకోని ప్రియాంక.. కాళ్లు తిమ్మిరెక్కిన శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ బామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. పింకీ చేసిన తప్పు వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
హౌజ్‌మేట్స్ పరిస్థితులను చూసి సన్నీ కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఫైనల్‌గా తొలి రౌండ్‌లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ప్రియాంక సింగ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్ అనే రెండో లెవల్‌లో బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో సన్నీ.. మానస్ సాయం కోరాడు. అయితే ఈ రౌండ్‌లో ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ను, మానస్ ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది.