Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఉన్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు పవన్‌ను ఒప్పించారు. దీంతో ఆయన తన మూవీని వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడింది. దీంతో భీమ్లా నాయక్‌పై అందరి కన్ను పడింది. అయినప్పటికీ సంక్రాంతికి ఈ మూవీ విడుదల కాలేదు. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా భీమ్లా నాయక్ నుంచి ఓ వీడియో లీకైంది. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పోలీస్ స్టేషన్ సీన్ ఉంది. అందులో పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతుండడం విశేషం. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
భీమ్లా నాయక్ చిత్రం రీమేక్ అయినప్పటికీ దీన్ని తెలుగుదనానికి దగ్గరగా ఉండే విధంగా తెరకెక్కించారు. రానా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం మరో ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
చాలా రోజుల తరువాత పవన్ మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండడం అభిమానులకు ఎంతగానో ఆనందాన్నిస్తోంది. అయితే ఫిబ్రవరి 25వ తేదీ వరకు పరిస్థితులు చక్కబడి కరోనా అదుపులోకి వస్తుందా.. చిత్రం విడుదలవుతుందా..? అనే అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. మరి అప్పటి వరకు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…