Rajnikanth : సెలబ్రిటీ ప్రపంచంలో ప్రస్తుతం విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. బయట మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుక్కుని వచ్చినంత తేలిగ్గా సెలబ్రిటీ జంటలు విడాకకులను తీసుకుంటున్నారు. సమంత, నాగచైతన్యల విడాకులు సంచలనం సృష్టించగా.. తాజాగా రజనీ అల్లుడు, నటుడు ధనుష్, రజనీ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన కుమార్తె, అల్లుడు విడాకులు తీసుకోవడంపై రజనీకాంత్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన తీసిన బాబా అనే మూవీలో సైతం కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతలపై పలు మార్లు ఆయన డైలాగ్‌లు చెప్పారు. అయితే ఆ డైలాగ్‌లు రజనీ జీవితంలోనే ప్రభావితం అవుతాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
ఇప్పటికే ధనుష్, ఐశ్వర్యలు పలు సందర్భాల్లో తమ మధ్య ఉన్న గొడవలపై రజనీకాంత్ వద్దకు వెళ్లారట. దీంతో రజనీ చాలా సార్లు వారిద్దరికీ నచ్చజెప్పారట. అయితే నిన్న మొన్నటి వరకు అంతా సద్దుమణిగిందని భావించే లోపే వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా వారు తమ కుటుంబ సమస్యను రచ్చ చేయడం రజనీకి అసలు ఏమాత్రం ఇష్టం లేదట. దీంతో ఆయన తన కుమార్తె భవిష్యత్తు ఏమవుతుందా.. అని తల్లడిల్లిపోతున్నారట.
అయితే ధనుష్, ఐశ్వర్యలను మళ్లీ కలిపేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న గొడవలను సామరస్యంగా పరిష్కరించేందుకు రజనీకాంత్ చొరవ చూపుతున్నారట. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న గొడవలతో ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరూ మళ్లీ కలుస్తారా.. లేదా విడిపోతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…