Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులలో ఎంతో క్రేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ సినిమాలు చేయను అనే సరికి అభిమానులే కాదు నిర్మాతలు కూడా డీలా పడ్డారు. అయితే ఎలాగోలా ఆయనను ఒప్పించి వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. పవన్‌కి ఉన్న మార్కెట్ బట్టి ఆయనతో భారీ బడ్జెట్ చిత్రాలే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తాజాగా కవర్ పాటకు సంబంధించి అనౌన్స్‌మెంట్ చేశారు. మరి కొద్దిగంటలలో పాట విడుదల కానుండగా, ఈ పాటకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాట కోసం దాదాపుగా 30 మందికి పైగా బృందం పని చేస్తోంది. రూ.25 లక్షలకు పైగా ఖర్చు అవుతోందని తెలుస్తోంది. థమన్ ఈ పాట కోసం అదిరిపోయే బాణీలు సిద్ధం చేస్తున్నాడట. ఈ కవర్ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ప్రతి ఎలిమెంట్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ ఎక్కించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినవే. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ టీజర్, రానా టీజర్, రెండు పాటలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…