Rajnikanth : వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రజనీకాంత్ ఫ్యూచర్‌లో సినిమాలు చేస్తారా.. అంటే.. లేదనే సమాధానం వినిపిస్తోంది. వయోభారం కారణంగా రజనీకాంత్ తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. తీవ్రమైన రక్తపోటు, అలసట కారణంగా రజనీ డిసెంబరు 25, 2020న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లిపోయారు.
అనారోగ్య సమస్యల వలన రజినీకాంత్ తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రకటనకు ముందు తాను అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిలో చేరడం.. ఇవన్నీ దేవుడి హెచ్చరికగా భావిస్తున్నాను. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నాను అని అన్నారు. ఇప్పుడు అన్నాత్తె పూర్తి చేసి మరో మూవీ చేద్దాం అనుకునేలోపు రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు.
తనకు మార్కెట్ ఉంది కాబట్టి, అభిమానులు చూస్తున్నారు కాబట్టి రజనీకాంత్ సినిమాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ గా సినిమాలు చేసే పరిస్థితిలో రజనీకాంత్ లేరు. వయసు రీత్యా వచ్చిన సమస్యల వల్ల ఆయన ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. 70 ఏళ్ల రజనీకాంత్ అన్నాత్తై (పెద్దన్న)తో కలిపి 168 సినిమాలు పూర్తిచేశారు. ఆయన 170 సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కు కూడా ఉంది. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. అదృష్టం బాగుంటే పెరియసామి, కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…