Bhanu Sree : యాంకర్ గా భానుశ్రీ అంటే అందరకీ సుపరిచితమే. మొదట్లో చిన్న చిన్న అవకాశాలతో సరిపెట్టుకున్న ఆమె.. బుల్లి తెరపై పలు షోలు చేసి మంచి పేరు తెచ్చుకుంది కానీ అవన్నీ చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో కి వెళ్ళగానే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అంతే కాదు బిగ్ బాస్ వల్ల ఆమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. భానుశ్రీ ఎక్కువగా ఈటీవీలో వచ్చే ఈవెంట్లలో కనిపిస్తూ ఉండేది. దాంతోపాటు హైపర్ ఆది టీమ్ లో జబర్దస్త్ లో మెరిసింది. తన గ్లామర్, నటన, స్టైలిష్ లుక్స్ తో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. ఇక సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూనే ఉంది.
మొన్న ఏడు చేపల కథలో ఆమె పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. దాంతోపాటు ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ భామ. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ గుడ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. భాను త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందట. ఆమె చేసుకోబోయే వరుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె చాలా షోలలో తన వ్యక్తిగత విషయాలు పంచుకునేది. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ముఖ్యంగా తన ఫ్రెండ్ కారణంగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నానంటూ తెలిపింది.
ఇప్పుడు ఆ ఫ్రెండ్ నే పెండ్లి చేసుకోబోతోందంట. అతన్ని చాలాకాలంగా ఆమె ప్రేమిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే పెళ్లితో ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్‌కు ఆమె రూ.30వేల నుంచి రూ.50వేల దాకా తీసుకుంటోంది. హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తే దానికిగాను దాదాపు రూ.60 వేల వరకూ తీసుకుంటుందట. పెళ్లి గురించి జరుగుతున్న చర్చ గురించి భాను ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…