Anasuya : జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనసూయకి చాలా బాగా ఫ్రీ టైం దొరికినట్లు ఉంది. లైగర్ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో ఆ సినిమాని పరోక్షంగా కామెంట్ చేస్తూ అనసూయ చేసిన ట్వీట్ పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మీద ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న అనసూయ ఫలానా అని పేరు చెప్పకుండా పరోక్షంగా ట్విట్టర్ ద్వారా లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఈ సమాజం ఏమైపోయినా ఫర్వాలేదు నేను మాత్రం ఆంటీకి సపోర్ట్ అంటూ అనసూయ ట్విట్టర్ కి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయని కామెంట్స్ తో అనసూయకి చిరాకు తెప్పించడం మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కామెంట్లతో మారుమోగిపోయింది. అనసూయ కూడా కామెంట్స్ చేసేవారికి ఘాటుగా సమాధానం చెబుతూ, ఆంటీ అంటే కేసు పెడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగకుండా చెప్పిన విధంగానే ఆంటీ అన్న వాళ్ళ అందరి మీద కేసులు కూడా పెట్టింది. ఇలా వివాదాల్లో చిక్కుకోవడంతో అనసూయకు కొత్త సమస్య వచ్చిపడింది.
అనసూయ ఈవిధంగా వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం అనసూయ సైన్ చేసిన ఒక సినిమా నుంచి తొలగిస్తున్నట్లు సదరు సినిమా నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అనసూయ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప చిత్రంలో దాక్షాయని అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సక్సెస్ ను అందుకుని నటీనటులు అందరికీ మంచి గుర్తింపు తెచ్చింది.
ఈ వివాదాలతో డైరెక్టర్ సుకుమార్ కూడా అనసూయ స్థానంలో మరో ఫీమేల్ క్యారెక్టర్ ను తీసుకోవడానికి ఆసక్తి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రం టైంలో విజయ్ దేవరకొండతో జరిగిన గొడవలను ఇంకా మనసులో పెట్టుకొని ఈ విధంగా ట్వీట్ చేయడం మంచి పద్ధతి కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణాల వలన అనసూయని పుష్ప 2 చిత్రం నుంచి తొలగించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పుష్ప చిత్రంతోపాటు అనసూయ మరొక తమిళ, మళయాళ చిత్రాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…