Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల తాజాగా పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయనంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఇది విని ఒక్కసారిగా పవన్ అభిమానులు షాక్ అయ్యారు. అయితే దాని వెనుక ఓ కారణం ఉందంటూ చెప్పుకు రావడంతో చల్లబడ్డారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటిని పూర్తి చేసుకుని నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను.
అయితే నా కోరిక ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు. వన్ కల్యాణ్ నన్ను నిర్మాత చేశారు. ఆయన అంటే ఇష్టం.. కానీ జనసేనలో చేరడంలాంటిది ఏమీ లేదన్న బండ్ల గణేష్.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం.. ఆయనను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని.. అలాగే నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభిమానినే అని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ గురించి, పవన్ కళ్యాణ్ గురించి నన్ను అడగకండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ. నా ఫ్యామిలీని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తాను.. అని కూడా స్పష్టం చేశారు బండ్ల.
దర్శకుడితో గొడవపై కూడా స్పందించిన బండ్ల.. డైరెక్టర్‌తో గొడవలు అయి సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. నేను నాగార్జున సాగర్‌లాంటోడిని. నీళ్లు వస్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడదు. వాళ్లందరూ ఆ టైపే. భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం అని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…