SS Rajamouli : శిలను చెక్కినట్టు తన ప్రతి సినిమాని అద్భుతంగా చెక్కుతూ జక్కన్నగా అభిమానుల చేత పిలిపించుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఓటెమెరుగని విక్రమార్కుడు ఈయన. అక్టోబర్ 10, 1973వ సంవత్సరంలో కర్ణాటకలోని రాయచూరులో జన్మించిన రాజమౌళి ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తాడు. అందుకే ఆయన చిత్రాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయి. సినిమాల్లోకి రాకముందు రాజమౌళి సీరియల్స్‌కి పని చేశాడు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు అందుకున్న రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేలా చేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). విడుదలకు ముందే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా మార్చి 25న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే అత్యధిక కలెక్షన్లను సాధిస్తూ వస్తోంది.
ఇక రాజమౌళి స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా నుండి మొదలైన ప్రయాణం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనుండగా, రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్ వేద్దాం.
రాజమౌళి తీసిన మొదటి సినిమా స్టూడెంట్ నం.1కు రూ.3 కోట్లు ఖర్చు అయింది. రూ.11 కోట్లు వచ్చాయి. అలాగే సింహాద్రికి ఖర్చు రూ.8 కోట్లు కాగా.. వసూళ్లు రూ.26 కోట్లు వచ్చాయి. ఇక నితిన్‌తో తీసిన సై మూవీకి రూ.5 కోట్లు ఖర్చు కాగా.. వసూళ్లు రూ.10 కోట్లు వచ్చాయి. అదేవిధంగా ప్రభాస్‌తో తీసిన ఛత్రపతికి రూ.10 కోట్లు ఖర్చు కాగా.. రూ.21 కోట్లు వసూలు చేసింది. ఇక రవితేజతో తీసిన విక్రమార్కుడు మూవీకి మొత్తం బడ్జెట్ రూ.11 కోట్లు అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.20 కోట్లను వసూలు చేసింది.
తరువాత ఎన్‌టీఆర్‌తో కలిసి రాజమౌళి యమదొంగ సినిమాను తీయగా.. దీనికి రూ.18 కోట్లు ఖర్చు అయింది. రూ.29 కోట్లు వసూలు అయ్యాయి. రామ్ చరణ్‌తో తీసిన మగధీరకు రూ.44 కోట్లు ఖర్చు కాగా.. వసూళ్లు రూ.151 కోట్లు వచ్చాయి. ఇక సునీల్‌తో తీసిన మర్యాద రామన్నకు రూ.14 కోట్లు బడ్జెట్ అయింది. ఇది రూ.29 కోట్లను రాబట్టింది. తరువాత తీసిన ఈగకు రూ.35 కోట్లు ఖర్చయింది. ఈ మూవీ రూ.43 కోట్లను వసూలు చేసింది. బాహుబలి మొదటి పార్ట్‌కు రూ.136 కోట్లు కాగా రూ.602 కోట్లను రాబట్టింది.
బాహుబలి 2వ పార్ట్‌కు రూ.250 కోట్లు ఖర్చు కాగా ఈ సినిమా రూ.1800 కోట్లను రాబట్టింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా ఈ మూవీ రికార్డులను సృష్టించింది. ఈ మూవీ కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ మూవీ కూడా కనీసం సమీపించలేకపోయింది. ఇక రాజమౌళి లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కు బడ్జెట్ రూ.550 కోట్లు కాగా.. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1120.10 కోట్లను వసూలు చేసింది. ఇలా రాజమౌళి తన కెరీర్‌లో అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే అందించారు. అయితే రాను రాను ఆయన సినిమాలకు బడ్జెట్ పెరుగుతుండడంతోపాటు కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్‌కు రూ.550 కోట్లు పెట్టారు కనుక మహేష్‌తో తీయబోయే సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో చూడాలి. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ కన్నా ఎక్కువ బడ్జెట్‌తోనే మహేష్ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…