Balakrishna : బాల‌య్య గొప్ప మ‌న‌సు.. డిప్రెష‌న్‌లో ఉన్న అభిమానికి వీడియోకాల్‌..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఈయ‌న పేరు చెప్ప‌గానే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేస్తాయి. ఇక ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే చాలు.. అభిమానుల‌కు పండ‌గే. ఆయ‌న కొట్టినా.. తిట్టినా స‌రే.. ఆయ‌న‌ను అభిమానించే వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అయితే బాల‌కృష్ణ బ‌య‌టికి గంభీరంగా.. ఎక్క‌డ తిడ‌తారో.. ఏం అంటారోన‌న్నంత క‌ఠినంగా క‌నిపిస్తారు. కానీ వాస్త‌వానికి ఆయ‌న మ‌న‌స్సు వెన్న‌లాంటిది. ఆయ‌న త‌న అభిమానుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. నిజానికి ఆయ‌న గురించి చాలా మందికి తెలిసింది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు ఆయ‌న గురించి ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న మృదు స్వ‌భావి. అభిమానుల‌కు అండ‌గా ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రోమారు ఓ అభిమాని ప‌ట్ల దాతృత్వం చూపించారు. వివ‌రాల్లోకి వెళితే..

Balakrishna

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదోనిలో ఉన్న మంద‌గ్రి గ్రామంలోని కాశీ విశ్వ‌నాథ్ అనే వ్య‌క్తి చిన్న‌ప్ప‌టి నుంచి బాల‌య్య ఫ్యాన్‌. ఆయన అంటే ప్రాణం. ఆయ‌న సినిమాల‌ను చూస్తూ పెరిగాడు. అయితే ఎప్ప‌టికైనా బాల‌కృష్ణ‌ను క‌ల‌వాల‌ని.. ఆయ‌న‌తో ఒక‌సారి మాట్లాడాల‌ని అత‌ని క‌ల‌. కానీ అది నెర‌వేర‌దేమోన‌ని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో కుమారుడి ప‌రిస్థితిని చూసిన త‌ల్లిదండ్రులు ఆదోని బాల‌కృష్ణ ఫ్యాన్ క్ల‌బ్ అధ్య‌క్షుడు ఎన్‌.స‌జ్జ‌ద్ హుస్సేన్‌ను క‌లిశారు. త‌మ కుమారున్ని కాపాడాల‌ని కోరారు. దీంతో హుస్సేన్ వెంట‌నే బాల‌కృష్ణ‌కు ఈ విష‌యం చేర‌వేశారు. అంతే.. వెంట‌నే బాల‌య్య స్పందించి త‌న అభిమాని కాశీ విశ్వ‌నాథ్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు.

త‌న అభిమానితో వీడియో కాల్‌లో మాట్లాడిన బాల‌య్య అత‌ని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అత‌నికి స‌హాయం చేస్తాన‌ని చెప్పి హామీ ఇచ్చారు. దీంతో కాశీ విశ్వ‌నాథ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఎట్ట‌కేల‌కు త‌న క‌ల నెర‌వేరింద‌ని ఎంతో సంబ‌ర‌ప‌డ్డాడు. ఇలా బాల‌కృష్ణ త‌న గొప్ప మ‌న‌సును మ‌రోమారు చాటుకున్నారు. గ‌తంలోనూ ఆయ‌న ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డి మంచం పాలైన మురుగేష్ అనే అభిమాని చికిత్స‌కు ఆర్థిక స‌హాయం అందించారు. ఇలా బాల‌కృష్ణ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. అందుక‌నే ఆయ‌న అంటే ఫ్యాన్స్‌కు అంత ఇష్టం, గౌర‌వం. ఈ క్ర‌మంలోనే తాజాగా బాల‌య్య చేసిన ప‌నికి ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ ఆయ‌న్ను మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM