Carrot Juice : మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయలు చాలానే ఉన్నాయి. వాటిల్లో క్యారెట్లు ఒకటి. ఇవి చూసేందుకు నారింజ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనుకనే వీటిని పచ్చిగానే చాలా మంది తింటుంటారు. వీటితో వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే క్యారెట్లను తినడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ రోజూ క్యారెట్లను తినడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగవచ్చు. దీన్ని సులభంగా తాగవచ్చు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. దీన్ని ఇలా రోజూ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. క్యారెట్‌ను ఇలా రోజూ జ్యూస్ రూపంలో నెల రోజుల పాటు తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు పోతాయి. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా పోతాయి. కళ్ల కింద నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.
రోజూ క్యారెట్ జ్యూస్‌ను నెల రోజుల పాటు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. నడుం, పొట్ట, పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగి సన్నగా మారుతారు. క్యారెట్ జ్యూస్‌ను తాగితే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో రక్తం బాగా తయారవుతంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్ రాకుండా గుండెను కాపాడుకోవచ్చు.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇది పిల్లలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వారిలో తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. మలబద్దకం, గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయి. అల్సర్లు నయమవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
క్యారెట్ జ్యూస్‌ను తాగితే శిరోజాలు ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు తగ్గుతుంది. ఇలా క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే దీన్ని రోజూ క్రమం తప్పకుండా కనీసం నెల రోజుల పాటు అయినా తాగాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…