Balakrishna : ఈ ఆగస్ట్ 5 న బింబిసార చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై యువ దర్శకుడు వశిష్ట కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు ఒక అద్భుతమైన కథను తీసుకువచ్చారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. టైం ట్రావెల్, ఫాంటసీ ఫిల్మ్ గా బింబిసార థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పవర్ ఫుల్ కథాంశంతో దర్శకుడు వశిష్ట కళ్యాణ్ రామ్ కి అద్భుతమైన సక్సెస్ ని అందించారు.
సినిమా మొదలైన వారం రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుండి కూడా బింబిసార చిత్రానికి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. బింబిసార చిత్రం సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ చిత్ర యూనిట్ ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంపై మంచి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. బింబిసార చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కి గానీ, ఎంఎం కీరవాణి అందించిన సంగీతం గానీ ఎంతో అద్భుతంగా ఉంది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చిత్ర యూనిట్ ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.
తొలిసారిగా చక్రవర్తిగా నటించిన కళ్యాణ్ రామ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బాలకృష్ణ కూడా బింబిసార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక చిత్రం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంకో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా బింబిసార 2 ను అనౌన్స్ చేశారు.