Balakrishna : యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అయితే కుప్పంలో తారక రత్న కుప్పకూలిన సమయం నుంచి బెంగళూరు వెళ్ళే వరకు… ఇప్పుడు ఈ క్షణం వరకు కన్న కుమారుడి కంటే ఎక్కువగా, కంటికి రెప్పలా నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నారు.
వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలానే అటు కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు అప్ టు డేట్… అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే బాలయ్య .. తారకరత్న చెవిలో మృత్యుంజయ హోమం చదివాడని అందుకే ఆ గుండె కొట్టుకుంటుందని నిర్మాత ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడారు తుమ్మల ప్రసన్నకుమార్… తారకరత్న కోలుకుంటున్నారు…కాళ్ళు , చేతులు కదుపుతున్నారన్నారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారు.
కుప్పంలో తారకరత్న గుండె దాదాపు 45 నిమిషాలు గుండె ఆగిందని తెలిపారు. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడు…మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నాడు..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని తెలిపారు. రోజు రోజుకీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, వైద్య చికిత్సకు ఆయన స్పందించడంతో పాటు కోలుకుంటున్నారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్ళి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…