Balakrishna : నందమూరి బాలకృష్ణ తన బావ చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడాలని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానళ్లు బాలకృష్ణ నివాసానికి చేరుకోగా బాలకృష్ణ కుటుంబం కేవలం రెండు న్యూస్ ఛానళ్లను మాత్రమే లోపలికి పిలిచి మిగిలిన వారి ముఖం మీదే గేట్లు వేస్తూ వారిని ఎంతో అవమానించారట.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై బాలకృష్ణను మీడియా చానల్స్ తప్పుబట్టాయి. మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం దేనికి అంటూ సదరు మీడియా ఛానల్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే బాలకృష్ణ ఇలా మీడియా పట్ల ప్రవర్తించడానికి గల కారణం.. బాలకృష్ణ కుటుంబం చేసిన తప్పులు ఏంటో తెలుసు కనుక.. మీడియా చానల్స్ వాటి గురించి అడిగితే ఆయన ఇబ్బందుల్లో పడతారు కనుక.. కేవలం తమకు అనుకూలమైన రెండు చానల్స్‌ను మాత్రమే లోపలికి రానిచ్చారని.. మిగిలిన చానల్స్‌ను గేటు బయటే ఆపేశారని.. తెలుస్తోంది.
ఇక అసెంబ్లీ ఘటనలో భాగంగా తన సోదరిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ.. బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు ఎంతో అవమానకరంగా, అరాచకంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని.. ఆ నేతలకు నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.