Balakrishna : మీరింక మార‌రా.. ఏ టైమ్‌లో సెల్ఫీ అడ‌గాలో తెలియ‌దా..? ఏం మ‌నుషులురా బాబూ..!

Balakrishna : సినిమా సెల‌బ్రిటీలు అంటే స‌హ‌జంగానే అంద‌రికీ ఎంతో కొంత ఆస‌క్తి ఉంటుంది. వారిని క‌ల‌వాల‌ని, వారితో ఫొటోలు దిగాల‌ని, వారి ఆటోగ్రాఫ్‌లు పొందాల‌ని.. క‌ల‌లు కంటుంటారు. ఇక త‌మ అభిమాన హీరో లేదా హీరోయిన్ అయితే ఆ తాప‌త్ర‌యం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఇంత వ‌ర‌కు ఓకే. అయితే ఏ టైమ్‌లో ఫొటో దిగాలో కూడా తెలిసి ఉండాలి. కానీ కొంద‌రు అస‌లు మైండ్ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకోకుండా సెల్ఫీలు దిగుతున్నారు. న‌లుగురిలోనూ అభాసుపాల‌వుతున్నారు. ఒక వ్య‌క్తికి ఇలాగే జ‌రిగింది.

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న సోద‌రి ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. చెల్లెలు పోయిన పుట్టెడు దుఃఖంలో ఆయ‌న ఉన్నారు. బ‌రువెక్కిన హృద‌యాల‌తో తీవ్ర మ‌న‌స్థాపంతో ఆయ‌న పాడె మోశారు. అయితే అదే స‌మ‌యంలో ఎక్క‌డి నుంచి వ‌చ్చాడో తెలియ‌దు కానీ.. ఒక వ్య‌క్తి మాత్రం బాల‌య్య వ‌ద్ద‌కు వ‌చ్చి సెల్పీ అడిగాడు. అయితే ఆ స‌మ‌యంలో బాల‌య్య తీవ్ర విషాదంలో ఉన్నారు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే అత‌ని చెంప చెళ్లుమ‌ని ఉండేది.

Balakrishna

కాగా అలా అత‌ను సెల్ఫీ కోసం వ‌చ్చిన బాల‌య్య‌ను అడిగిన‌ప్పుడు బాల‌య్య చూసిన చూపుకు చెందిన ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. అంద‌రూ ఆయ‌న చెంపదెబ్బ కొడ‌తారేమోన‌ని అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇక‌నైనా మారాల‌ని.. స‌మయం, సంద‌ర్భం చూసి సెల్ఫీలు అడ‌గాల‌ని.. ఇలా మైండ్ లేకుండా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని నెటిజన్లు హిత‌బోధ చేస్తున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM