Rekha Vedavyas : శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వచ్చిన ఆనందం మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ మూవీ ద్వారా తెలుగు పరిచయం అయిన బ్యూటీ.. రేఖ. ఈమె పూర్తి పేరు రేఖ వేదవ్యాస్. ఈమెది కర్ణాటక. కన్నడలో అనేక సినిమాల్లో ఈమె నటించింది. అప్పట్లో ఈమె అనేక మంది యంగ్ హీరోలతో నటించింది. నందమూరి తారకరత్నతో కలిసి ఒకటో నంబర్ కుర్రాడులో యాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ మూవీలోని పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి.
ఇక ఆనందం తరువాత జాబిలి, ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి చిత్రాల్లో రేఖ నటించింది. అయితే నాగార్జున మన్మథుడు మూవీలో ఈమె గెస్ట్ రోల్‌లో నటించింది. ఈ క్రమంలోనే ఆయన ఈమెకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ ఆయన నుంచి కాల్ రాలేదు. అసలు ఏమైంది.. అన్న విషయం కూడా తెలియదు. కానీ ఈమె అప్పుడప్పుడు ఈ విషయం చెబుతూ విచారిస్తుంటుంది.
ఇక రేఖ చివరిసారిగా తెలుగులో జీనియస్ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించగా.. ఈమె చివరి సినిమా పాదమ్ పేసమ్. తమిళంలో వచ్చింది. 2014లో తెరకెక్కించారు. అప్పటి నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కన్నడ సీజన్‌లో ఈమె పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ బ్యూటీకి ఇప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం కాలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…