Balakrishna : సినిమా సెలబ్రిటీలు అంటే సహజంగానే అందరికీ ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. వారిని కలవాలని, వారితో ఫొటోలు దిగాలని, వారి ఆటోగ్రాఫ్‌లు పొందాలని.. కలలు కంటుంటారు. ఇక తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ అయితే ఆ తాపత్రయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంత వరకు ఓకే. అయితే ఏ టైమ్‌లో ఫొటో దిగాలో కూడా తెలిసి ఉండాలి. కానీ కొందరు అసలు మైండ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సమయం, సందర్భం చూసుకోకుండా సెల్ఫీలు దిగుతున్నారు. నలుగురిలోనూ అభాసుపాలవుతున్నారు. ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది.
నందమూరి బాలకృష్ణ తన సోదరి ఉమా మహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చెల్లెలు పోయిన పుట్టెడు దుఃఖంలో ఆయన ఉన్నారు. బరువెక్కిన హృదయాలతో తీవ్ర మనస్థాపంతో ఆయన పాడె మోశారు. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఒక వ్యక్తి మాత్రం బాలయ్య వద్దకు వచ్చి సెల్పీ అడిగాడు. అయితే ఆ సమయంలో బాలయ్య తీవ్ర విషాదంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే అతని చెంప చెళ్లుమని ఉండేది.

కాగా అలా అతను సెల్ఫీ కోసం వచ్చిన బాలయ్యను అడిగినప్పుడు బాలయ్య చూసిన చూపుకు చెందిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందరూ ఆయన చెంపదెబ్బ కొడతారేమోనని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇకనైనా మారాలని.. సమయం, సందర్భం చూసి సెల్ఫీలు అడగాలని.. ఇలా మైండ్ లేకుండా ప్రవర్తించవద్దని నెటిజన్లు హితబోధ చేస్తున్నారు.