Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరిలో బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాలతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. అఖండ చిత్రం సక్సెస్ కావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే 107 పై అందరి దృష్టి పడింది.
బోయపాటి దర్శకత్వలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య నట విశ్వరూపంతో నందమూరి అభిమానుల నుంచి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్బీకే 107 మూవీలో భాగంగా టర్కీలో బాలయ్య షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ మాట కరుకు మనసు వెన్న లాంటి స్వభావం కలవారు. బాలయ్యకు అభిమానులంటే ఎంతో అభిమానం. ఇంతకముందు టర్కీలో ఓ రెస్టారెంట్‌లో సామాన్యుడితో ముచ్చటించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా కమెడియన్ సప్తగిరితో ఫన్నీగా మాట్లాడిన బాలయ్య బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సప్తగిరితోపాటు డైలాగ్ చెబుతూ బాలయ్య అలరించారు. ఒకేసారి ఇద్దరు డైలాగ్ చెబుతుండగా మధ్యలో బాలయ్య ఆపేశారు. సప్తగిరి మాత్రం డైలాగ్ కంటిన్యూ చేసి బాలయ్యను మెప్పించాడు. సప్తగిరి టాలెంట్ ను చూసి వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల పట్టుకున్నాడు. ఓసారి నీ కాళ్లుపైకి ఎత్తరా దండం పెడతా, దండం పెట్టడం కోసం కిందకు వంగితే నా నడుము విరిగేటట్లు ఉంది అంటూ సప్తగిరితో చాలా సరదాగా మాట్లాడారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరించడంతోపాటు సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటోంది. నెటిజన్లు దీన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022