Balakrishna : తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు టాక్ షోలు, వంటల కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఆహాలో గతంలో సమంతను వ్యాఖ్యాతగా ఉంచి సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సమంతను రంగంలోకి దించినా ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు.
ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోకి ప్రేక్షకాదరణ కరువైందని చెప్పవచ్చు. తాజాగా ఆహా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు పలు రకాల సందేహాలను వ్యక్తపరిచారు.
అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడితే అందరిపై చేయి చేసుకునే బాలయ్య ఓపిగ్గా ఈ టాక్ షోను నిర్వహించగలరా.. అల్లు అరవింద్ ఏ నమ్మకంతో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకున్నారు.. అంటూ చాలా రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే ఈ కార్యక్రమం ప్రోమోకి నిర్వాహకులు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ప్రేక్షకాదరణ లభించింది.
అలాగే ఎంతోమంది సబ్‌స్క్రైబర్లు కొత్తగా చేరారని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాని బాలయ్యతో కలిసి సందడి చేశారు. కాగా మూడవ ఎపిసోడ్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారు. ఏది ఏమైనా ఆహాలో టాక్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సమంత విఫలమైందని.. బాలకృష్ణ విజయం సాధించారని.. చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…