Karthikeya : ఆర్ఎక్స్100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్‌గా రాజా విక్రమార్క చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేకపోయింది.
‘రాజా విక్రమార్క’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ఆర్ఎక్స్ 100 హీరో తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట ! ఈ మేరకు కార్తికేయ-లోహితల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకకు ఆయన బంధుమిత్రులతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, కార్తికేయ ‘నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాడు. 2012లో ప్రపోజ్ చేశాడు. సంవత్సరం తర్వాత ఆమె ఒప్పుకుంది. బీటెక్ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది.. అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు కార్తికేయ.
కాగా కార్తికేయ లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్టమొదటిసారి లోహితను కలిసిన ఈ హీరో 2012లో ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లాడబోతున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…