Bahubali Netflix Series : బాహుబ‌లి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ర‌ద్దుకు కార‌ణం ఇదేనా ?

Bahubali Netflix Series : ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద బాహుబ‌లి రెండు సినిమాలు సృష్టించిన క‌లెక్ష‌న్ల సునామీ అంతా ఇంతా కాదు. బాహుబ‌లి సినిమా భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. దీంతో ఈ మూవీల‌కు ప్రీక్వెల్‌గా ఓ సిరీస్‌ను తీయాల‌ని అప్ప‌ట్లో నిర్ణ‌యించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ ప్రాజెక్టుకు పూనుకుంది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అస‌లు అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఈ సిరీస్‌ను ఎందుకు ర‌ద్దు చేశార‌ని.. ప్రేక్ష‌కులు స‌మాధానాల కోసం వెదుకుతున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్‌.. ది రైజ్ ఆఫ్ శివ‌గామిని ర‌చించారు. బాహుబ‌లి మొద‌టి పార్ట్‌కు 40 ఏళ్ల ముందు అస‌లు ఏం జ‌రిగింది ? అన్న వివ‌రాలు ఆ క‌థ‌లో ఉంటాయి. అందులో ప్ర‌ధానంగా శివ‌గామి, క‌ట్ట‌ప్ప‌ల మ‌ధ్య ప్రేమ క‌థ‌, మాహిష్మ‌తి సామ్రాజ్యం గురించిన ముఖ్య‌మైన విశేషాలు.. ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నెట్ ఫ్లిక్స్ దీన్ని.. బాహుబ‌లి: బిఫోర్ ది బిగినింగ్ పేరిట సిరీస్‌లా తీయాల‌ని భావించింది.

అయితే తాజాగా ఈ సిరీస్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్టుపై రూ.150 కోట్ల మేర ఖ‌ర్చు పెట్టార‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును ర‌ద్దు చేయాల‌నే ముందుకు సాగింది.

అయితే ఈ సిరీస్ గురించి రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ట‌. నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ.. రాజ‌మౌళిని ఒప్పించ‌డంలో ఫెయిల్ అయిన‌ట్లు తెలిసింది. రాజ‌మౌళి అస‌లు ఏమాత్రం ఈ ప్రాజెక్టు వైపు చూడ‌లేద‌ట‌. ఇక దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారులు వెబ్ సిరీస్‌ను తీసి ఫ‌స్ట్ కాపీని సిద్ధం చేసినా నెట్‌ఫ్లిక్స్‌కు అది ఏమాత్రం న‌చ్చ‌లేద‌ట‌. మ‌రోవైపు రాజ‌మౌళి ప‌ట్టించుకోలేదు. అందువ‌ల్లే ఇక‌పై ఈ ప్రాజెక్టును ముందుకు కొన‌సాగించ‌లేమ‌ని భావించిన నెట్ ఫ్లిక్స్ రూ.150 కోట్లు పెట్టిన‌ప్ప‌టికీ ఈ ప్రాజెక్టును ర‌ద్దు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకుంది.

అయితే రాజ‌మౌళి ఈ సిరీస్ గురించి ప‌ట్టించుకుని కాస్తంత శ్ర‌ద్ధ వ‌హించి ఉంటే ఈ సిరీస్ ఇప్ప‌టికే రిలీజ్ అయి ఉండేద‌ని అంటున్నారు. అస‌లు రాజ‌మౌళి దీని గురించి ఎందుకు ప‌ట్టించుకోలేదో అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు అంటున్నారు. మ‌రి దీనిపై రాజ‌మౌళి స్పందిస్తారో లేదో చూడాలి..!

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM