Cyber Fraud : సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఓటీపీలు, గట్రా చెప్పకూడదని పోలీసులు ఓ వైపు ఎంత హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. తక్కువ ధరకే మీల్స్ అంటే ఆశ పడి ఆర్డర్ చేశాడు. రూ.1 లక్ష మేర పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ఖార్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఎన్‌డీ నంద్ (74) జనవరి 19వ తేదీన ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ చూశాడు. అందులో కేవలం రూ.100 చెల్లిస్తే 3 మీల్స్ పొందవచ్చు అని ఉంది. దీంతో వెంటనే అందులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి ముందుగా రూ.10 చెల్లించాలని.. మిగిలిన రూ.90 లను మీల్స్ డెలివరీ సమయంలో క్యాష్ రూపంలో చెల్లించాలని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ వివరాలను నమ్మిన నంద్ వెంటనే తన క్రెడిట్ కార్డు వివరాలను అవతలి వ్యక్తికి చెప్పాడు. వారు ఆ కార్డుతో రెండు దఫాలుగా ట్రాన్సాక్షన్ చేశారు. ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా వారు అడిగినట్లు వారికి నంద్ ఓటీపీ చెప్పాడు. దీంతో 2 దఫాల్లో మొత్తం రూ.99,520 లను దుండగులు కాజేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నంద్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్ వర్డ్‌లను చెప్పకూడదని.. పోలీసులు మరోమారు హెచ్చరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…