Pushpa Movie : పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఆ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అందులో అల్లు అర్జున్ తన భుజాన్ని పైకెత్తి నడిచే స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో అదే స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం పుష్ప స్టైల్‌ను ఫాలో అయ్యారు.
ఇప్పటికే రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి వారు పుష్ప స్టైల్‌ను అనుకరించి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా విండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. వికెట్ తీసిన అనంతరం పుష్పలా నడుస్తూ అలరించాడు.
తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో బ్రేవో వికెట్ తీసిన అనంతరం ఆ విధంగా పుష్ప స్టైల్‌ను అనుకరించాడు. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది.
కాగా డ్వేన్ బ్రేవో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు. ఎన్నో విజయాలను అందించాడు. అయితే ఈసారి చెన్నై టీమ్ మాత్రం బ్రేవోను రిటెయిన్ చేసుకోలేదు. దీంతో అతను మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకుని మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే చెన్నై టీమ్ మళ్లీ అతన్ని కొనుగోలు చేస్తుందా.. లేదా వేరే ఏదైనా టీమ్ అతన్ని తీసుకుంటుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…