Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో మెగాస్టార్‌కి బ్యాడ్ టైం మొదలైనట్టే. ఇక ఆయన ఇండస్ట్రీ హిట్ అనేది తన ఖాతాలో వేసుకోవడం కష్టమని నెటిజన్స్, యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి గతంలో కూడా ఎన్నో రీమేక్ సినిమాలు చేసి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అది ఇప్పుడు వర్కౌట్ కావడం కాస్త కష్టమే అంటున్నారు.
గాడ్ ఫాదర్ సినిమా మళయాళంలో మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ సాధించిన లూసిఫర్ ఆధారంగా తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, నయనతారలాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపిస్తుంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ను, పాటలను మేకర్స్ వదిలారు. ఇవి మెగా ఫ్యాన్స్‌లోనే కొందరికి అంతగా నచ్చలేదనే ఫీడ్ బ్యాక్ వినిపించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మరోవైపు భోళా శంకర్ సినిమా కథ కొత్తదేమీ కాదు.

ఇలాంటి కథ మెగాస్టార్‌కి కలిసి రావడం కష్టమే అంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్య కూడా అంత గొప్పగా రావడం లేదని టాక్! ఎంత మేకోవర్‌లో 25 ఏళ్ళ వయసు తగ్గించి చూపించినా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అసలు విషయం తెలుస్తూనే ఉంది. ఏజ్‌కి తగ్గట్టు మెగాస్టార్ కొత్త తరహా కథలను ఎంచుకుంటే తప్ప సక్సెస్‌లను అందుకోవడం కష్టం అంటున్నారు నెటిజన్స్. బాలయ్య చేసిన అఖండ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆయన హిట్ ఫ్లాపులను పక్కన పెడితే, సినిమా సినిమాకు భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు చిరుకి కూడా అవసరమని ఫ్యాన్సే అంటున్నారు. చిరు నెక్స్ట్ ఎలాంటి కథలు ఎంచుకుంటాడో చూడాలి.