Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా సమంత, నాగచైతన్యలకు ఎంతగానో పేరు ఉండేది. కానీ వీరు విడాకుల నిర్ణయాన్ని ప్రకటించాక ఆ పేరు వీరికి పోయింది. వీరు విడివిడిగా ఉంటున్నప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. సమంత తన సోషల్ ఖాతాల్లో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించాక ఆ అనుమానాలు బలపడ్డాయి. తరువాత అవే నిజమయ్యాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే విడాకుల నిర్ణయం తరువాత ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు సమంత తీర్థ యాత్రలు, టూర్లు వెళ్లి వచ్చింది. తరువాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది. మరోవైపు నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. కానీ ఇద్దరిలో సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
విడాకుల తరువాత సినిమాల జోరు పెంచిన సమంత తాజాగా హాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. అయితే సమంతకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..
సమంత అప్పట్లో నటుడు సిద్ధార్థతో లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు, బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత సమంత చైతూను పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవల సమంత విడాకుల ప్రకటనపై సిద్ధార్థ్ పరోక్షంగా స్పందించాడు. అతని ట్వీట్ వైరల్ అయింది.
అయితే అప్పట్లో సిద్ధార్థనే పెళ్లి చేసుకోవాలని సమంత బలంగా ఫిక్సయిందట. ఇదే విషయంపై ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. అప్పట్లో సమంత, సిద్ధార్థ కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని అనుకున్నారట. కానీ అలా జరగలేదు. పెళ్లి పీటల వరకు వచ్చిన విషయం ఎందుకు అక్కడితోనే ముగిసిపోయింది, తరువాత ఎందుకు వారు విడిపోవాల్సి వచ్చింది.. అన్న విషయాలు తెలియవు. కానీ ఆ సంఘటన వల్ల సిద్థార్థ్ చాలా డిస్టర్బ్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…