Sree Leela : అప్పట్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే అదే మూవీ పేరిట మళ్లీ శ్రీకాంత్ కుమారుడు రోషన్‌తో ఆయన పెళ్లి సందD అనే సినిమాను తీశారు. ఈ మూవీకి కూడా అందరి ప్రశంసలు దక్కాయి. ఇందులో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.
అయితే తొలి సినిమాతోనే శ్రీలీల నటనలో తానేంటో నిరూపించుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టాయి. పెళ్లి సందD సినిమా దసరా సందర్బంగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం శ్రీలీల తన చదువులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పెళ్లి సందD సినిమా హిట్ కావడంతో శ్రీలీలకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె చదువుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు ఆమె ప్రిపేర్ అవుతోంది. ప్రస్తుతం శ్రీలీల ముంబైలో ఉండగా.. అక్కడే పరీక్షలకు సిద్ధమవుతోంది.
ఇక కొద్ది రోజుల పాటు ఆమె అక్కడే ఉండనుంది. మళ్లీ పరీక్షలు అయ్యాక మూవీల్లో నటించనుంది. శ్రీలీల ఇప్పటికే పలు వరుస సినిమాలకు సైన్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని మూవీలకు చర్చలు జరుగుతున్నాయి. ఈమె టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌లలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు, హీరోలు ఆసక్తిని చూపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…