Ashoka Vanamlo Arjuna Kalyanam : యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్.. హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సాధించినప్పటికీ పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. న్యూస్ యాంకర్ దేవీ నాగవల్లితో ఏర్పడిన వివాదం కారణంగా ఈ మూవీకి బాగానే పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ థియేటర్లకు ప్రేక్షకులను మాత్రం రప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు గాను డిజిటల్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈ యాప్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఆహాలో జూన్ 3వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటన చేసింది.

కాగా ఈ మూవీని ఎస్‌వీసీసీ డిజిటల్ నిర్మించింది. జై క్రిష్ సంగీతం అందించారు. ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ మూవీకి మంచి స్పందనే లభించింది. కనుక ఓటీటీలో ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.