Apple iPhone : టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఇప్పటికే డ్యుయల్ సిమ్ ఐఫోన్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ నుంచి తన ఐఫోన్లలో యాపిల్ డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తూ వస్తోంది. అయితే వాటిల్లో ఫిజికల్ సిమ్ కార్డు స్లాట్ ఒకటే ఉంటుంది. రెండోది ఇ-సిమ్ స్లాట్. కాగా ఇకపై అందించే ఐఫోన్లలో రెండింటినీ ఇ-సిమ్ రూపంలోనే అందించనున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఇకపై రానున్న ఐఫోన్లలో ఫిజికల్ సిమ్ కార్డు స్లాట్ ఒక్కటి కూడా ఉండదన్నమాట.
వచ్చే ఏడాది.. అంటే.. 2022 సెప్టెంబర్ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్.. ఐఫోన్ 14 సిరీస్‌లో సిమ్ కార్డ్ స్లాట్‌లను యాపిల్ అందించబోదని తెలుస్తోంది. అయితే గతంలో ఐఫోన్ 15 సిరీస్ నుంచి సిమ్ కార్డ్ స్లాట్‌లను తీసేయాలని అనుకున్నారట. కానీ అంతకు ఒక ఏడాది ముందుగానే.. అంటే.. వచ్చే ఏడాది ఐఫోన్ 14 మోడల్స్ నుంచే సిమ్ కార్డ్ స్లాట్‌లను అందివ్వరని తెలుస్తోంది.
ఈ క్రమంలో కొత్త ఐఫోన్ మోడల్స్‌లో అసలు సిమ్ కార్డ్‌లకు స్లాట్స్ ఉండవు. రెండు సిమ్ కార్డు స్లాట్స్ కూడా ఇ-సిమ్ టైప్‌లో ఉంటాయి. అంటే.. నెట్‌వర్క్ ఆపరేటర్ వద్దకు వెళ్లి నేరుగా నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. కానీ యాపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…