Akhil Akkineni : నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ తన తొలి చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో చేశాడు. అఖిల్ పేరుతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేశాడు అఖిల్. హలో అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా అఖిల్ కు హ్యాండ్ ఇచ్చింది. ఆ వెంటనే మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫర్లేదు అనిపించుకుంది. దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ ను ఎంచుకున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. ముఖ్యంగా కండలు తిరిగిన దేహంతో అబ్బురపరిచేందుకు చాలా కష్టపడుతున్నాడు.
అఖిల్ ‘ఏజెంట్’ మూవీ కోసం చాలా కాలంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో కూడా కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హాలీవుడ్ హీరోలా మారిపోయిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు. దీనికి ‘2022లో ఒక తుఫాను రాబోతుంది. దాన్ని నేను ఫీల్ అవుతున్నాను’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక, ఇందులో అతడు జుట్టు ముడిపెట్టుకుని, తల కిందకు దించి కూర్చున్నాడు. అసలు ఇతడు అఖిలేనా అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…