Anushka Shetty : తెలుగు సినీ ప్రేక్షకులకు జేజమ్మగా పేరుగాంచిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించినా.. అరుంధతి ద్వారానే ఎక్కువగా పేరు వచ్చింది. టాలీవుడ్‌లో సీనియర్ అగ్ర హీరోలు చాలా మందితో ఈమె నటించింది. అయితే సైజ్ జీరో అనే మూవీ ద్వారా ఈమె బాగా లావుగా మారిపోవడం.. తరువాత బరువు తగ్గాలనుకున్నా అది సాధ్యం కాకపోవడంతో.. ఈమెకు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి. బాహుబలి తరువాత దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి ఈమె దూరమైందనే చెప్పవచ్చు. ఒకటి రెండు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా అనుష్క శెట్టికి చెందిన ఓ వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
తెలుగులో అనుష్క మొదటి చిత్రం సూపర్. ఇందులో ఆమె నాగార్జునతో కలిసి నటించింది. తరువాత కూడా వీరు పలు చిత్రాల్లో కలసి నటించారు. అలాగే నాగార్జున సినిమాల్లో ఈమె కొన్ని పాటల్లోనూ ప్రత్యేకంగా కనిపించింది. దీంతో వీరిమధ్య అఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆమెను చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయనున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వాటిని నాగార్జున ఖండించారు. ఇక తాజాగా అనుష్క శెట్టికి, నాగార్జునకు మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.
అనుష్క శెట్టిని నాగార్జున ప్రస్తుతం దూరం పెట్టారట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈమెను ఆయన ఎందుకు దూరంగా పెట్టాడు.. అన్న విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.. కానీ చైతన్యతో అనుష్క పెళ్లి వార్తలపై ఆమె తల్లి బాగా హర్ట్ అయిందట. అందుకనే నాగార్జున ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఆమె చెప్పిందట. దీంతో అనుష్క అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటుందని సమాచారం. దీంతో నాగార్జున కూడా ఆమెకు దూరంగానే ఉంటున్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక నాగార్జున, అనుష్క శెట్టి కలసి సూపర్, డాన్, కింగ్, కేడీ, రగడ, ఢమరుకం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, ఓం నమో వెంకటేశాయ.. తదితర చిత్రాల్లో నటించారు. కాగా అనుష్క శెట్టి చివరిసారిగా నిశ్శబద్ధం అనే మూవీలో నటించింది. ఇది 2020లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశ పరిచింది. అప్పటి నుంచి ఈమె ఖాళీగానే ఉంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…