Dhruva Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, దర్శకుడు సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ధృవ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్‌కు జోడీగా రకుల్ నటించింది. అలాగే మరో ముఖ్య పాత్రలో అరవింద్ స్వామి యాక్టింగ్‌ను అదరగొట్టేశారు. ఈ మూవీ 9 డిసెంబర్ 2016వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టైటిల్‌లో ధ అనే అక్షరం మీద 8 అనే నంబర్‌ను ఉంచుతారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. అయితే ఈ 8 అంకెకు, ఇందులో వాడిన అష్ట దిగ్బంధనం అనే పదానికి ఉన్న అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూవీలో ఇచ్చిన 8 అంటే.. అష్ట దిగ్బంధనం అనే పదానికి.. శత్రువును తుదముట్టించే ముందు ఎనిమిది దిక్కుల నుండి రౌండప్ చేయాలి. అంటే పారిపోడానికి అవకాశమే లేకుండా చేయాలి. అలాగే ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ విలన్ అరవింద్ స్వామిని అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు. కాకపోతే దిక్కుల ప్రకారంగా కాకుండా విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తాడు. అంటే అతనికి ఉండే కీర్తి, ధనం ఇలా అన్నింటినీ ఒక్కోదాన్ని దూరం చేస్తూ వస్తాడు. చివరకు మరణం వస్తుంది.
అష్ట దిగ్బంధనం అనే దాన్ని ఈ మూవీలో ఇంకో విధంగా ఉపయోగించారు. విలన్‌కు ఉన్న 8 అవకాశాలు దెబ్బ తీస్తాడు. అంటే.. ఓ గొప్ప సైంటిస్ట్ గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత ఛీ కొట్టించి అతని కీర్తిని దెబ్బ తీస్తాడు. అలాగే ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తూ అతని మేథస్సును దెబ్బ తీస్తాడు. తన బలాన్నంతా పోగొడతాడు. కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను అతడి తండ్రికే తెలియజేస్తూ అతన్ని ఎమోషనల్‌గా దెబ్బ తీస్తాడు.
తరువాత అతని ధైర్యాన్ని ఎదిరించి దెబ్బ కొడతాడు. అలాగే ఓ డీల్ కోసం అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకుని డబ్బు పరంగా దెబ్బ కొడతాడు. అలాగే మానవత్వాన్ని కూడా పోగొడతాడు. ఇలా ఏడింటిని చరణ్ దూరం చేస్తాడు. అయితే 8వ అంశం అయిన మరణంపై మాత్రం చరణ్ దృష్టి పెట్టడు. కానీ తాను అష్ట దిగ్బంధనం అయ్యానన్న విషయాన్ని గ్రహించిన విలన్ తన మరణాన్ని తానే ఫిక్స్ చేసుకుంటాడు. ఇలా అతని మరణంతో మొత్తం అష్ట దిగ్బంధనం పూర్తవుతుంది. దీన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. సినిమా హిట్ అయ్యేందుకు ఇది ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…