Anushka Shetty : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ హీరోయిన్స్ లో అనుష్కకు విపరీతమైన క్రేజ్ ఉంది. సూపర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆమెకు అంతగా గుర్తింపు రాకపోయినా, ప్రభాస్ తో కలిసి నటించిన సినిమాలు ఆమె కెరీర్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మిర్చి, బిల్లా, బాహుబలి సినిమాలు హిట్ ని అందించాయి. అయితే సూపర్ స్టార్ డమ్ ని బాహుబలి సినిమాతో సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె యాక్టింగ్ పై అంతగా ఫోకస్ చేయడం లేదేమో అనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి సినిమా తర్వాత తాను యాక్ట్ చేసే సినిమాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని, స్టార్ డమ్ ఉన్న పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని.. మరీ ముఖ్యంగా అనుష్క తాను యాక్ట్ చేయబోయే పాత్రలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా ప్రకటిస్తుందని.. ఎంతోమంది అభిమానులు అనుకున్నారు. మీడియాలో కూడా ఇవే వార్తలు హల్ చల్ అయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో అనుష్క తల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందనే వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
అయితే అనుష్క శెట్టి బరువు సమస్యలతో ఇబ్బంది పడుతోందని, అందుకే సినిమాలపై ఫోకస్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని అనుకుంటున్నారు. లేటెస్ట్ గా అనుష్కకి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. అనుష్క ప్రస్తుతం చాలా ఫిట్ గా కనిపిస్తోంది. అయితే స్లిమ్ గా మాత్రం కనిపించడం లేదు. అలా సన్నగా మారాలంటే అనుష్క ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు కన్నా అనుష్క చక్కని శరీరాకృతిలో కనిపిస్తోంది. ఇప్పుడైనా అనుష్క కొత్త సినిమాలు ఒప్పుకుంటుందా.. లేదా.. అనేది.. చూడాలి.