Anita Hassanandani : అనిత హాసనందని.. ఈ పేరు వింటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టరు. కానీ అప్పట్లో ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను చిత్రంలో ఎమోషనల్ పాత్రలో నటించిన హీరోయిన్ అంటే మాత్రం ఇట్టేగుర్తు పడతారు. ఈమె చేసిన సినిమాల్లో తొట్టి గ్యాంగ్, శ్రీరామ్, నేనున్నాను, ఆడంతే.. అదో టైపు వంటి ఎన్నో సినిమాలు ఈమెకు మంచి పేరును తీసుకువచ్చాయి. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే అయినప్పటికీ బాలీవుడ్ కి చెందిన రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరం అయింది. కానీ అప్పుడప్పుడు పలు హిందీ అనువాద ధారావాహికలలో నటిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది. ఈమె మంచి స్టార్ గా ఉన్నప్పుడు.. రోహిత్ రెడ్డి అనే అబ్బాయిని పెళ్లాడింది. ఈ మధ్యనే వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. ఇక అందుకే అనిత కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే.. ఇకమీదట బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.

తన ఫోకస్ మొత్తం పూర్తిగా బిడ్డ పైనే ఉంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న అనిత ఒక్కసారిగా మీడియా ముందు తళుక్కున మెరిసింది. మోకాళ్ళ పైవరకు ఉన్న షార్ట్ వేసుకొని తొడలు కనిపించేలా ఉన్న అనితను చూసిన నెటిజన్లు.. తల్లి అయినా కూడా అమ్మడి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. స్టన్నింగ్ లుక్స్, క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది అనిత. ప్రస్తుతం అనిత లేటెస్ట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.