ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి దాటికి ఎంతో మంది బలయ్యారు. ఈ క్రమంలోనే కరోనాతో మృతి చెందిన వారిని సొంత వాళ్లు కూడా తాకడానికి వెనుకడుగు వేస్తున్న సమయంలో ఎంతోమందికి అయిన వాళ్లల, ఆప్త మిత్రుడిలా, కన్న కొడుకులా దగ్గరుండి సుమారు మూడు వందల ముప్పై కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఓ మనసున్న మారాజు చివరికి ఆ మహమ్మారి బారిన పడి తనువు చాలించిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజమహేంద్రవరం మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మూరుకు చెందిన మల్లిపూడి మణికంఠ,భరత్ రాఘవ అనే ఇద్దరు యువకులు కరోనాతో మరణించిన మృతదేహాలకు వారి దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించే వారు. ఈ క్రమంలోనే భరత్, మణికంఠ ఇద్దరూ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే విశాఖపట్నం కేజీహెచ్‌లో కోవిడ్ చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడు. మణికంఠతో కలిసి భరత్ రాఘవ ఇప్పటి వరకు 330 సొంత డబ్బులతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్నేహితుడు మరణం పై భరత్ మాట్లాడుతూ.. మా ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కరణలు నిర్వహించాము. ఈ క్రమంలోనే తన స్నేహితుడు మణికంఠ కరోనా బారినపడి మృతి చెందాడని తాను ప్రస్తుతం మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.