Anasuya : అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న అనసూయ బుల్లితెరపైనే కాదు వెండితెర పై కూడా అలరిస్తూనే వుంది. ప్రస్తుతం సినిమాలు, వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నాని తప్పించి అనసూయని ఈ షోకి తీసుకున్నారంటే ఆమెపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా కోసం కాస్త టైమ్ కేటాయిస్తుంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్‌తోపాటు గ్లామర్ ఫోటో షూట్స్ ను తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్ళడిగిన ప్రశ్నలపై తనదైన కోణంలో స్పందించడం ఆమె నైజం.
తాజాగా ఓ నెటిజన్.. మీకు పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. అవసరమైతే ఆ రోల్ కోసం గుండు కొట్టించుకుంటారా ? అని ప్రశ్నించాడు. దీనిపై రియాక్ట్ అయిన జబర్దస్త్ బ్యూటీ తప్పకుండా.. ఆ క్యారెక్టర్ కోసం అవసరం అనుకుంటే గుండు కొట్టించుకుంటా” అంటూ ఓపెన్ అయింది. ఇది చూసి సినిమాల పట్ల అనసూయకు ఉన్న మక్కువ, కెరీర్ విషయంలో ఆమె డెడికేషన్ సూపర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.