Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై బిజీ ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటున్న ఈ అమ్మడు.. రియల్ లైఫ్ మాత్రం తానే ఓ ఏంజెల్ లా కలరింగ్ ఇస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, ప్రతి మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిటన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.

అయితే అనసూయ ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని ఖుషి చేసేలా గ్లామర్ ఫోటోస్‌ని షేర్ చేస్తుంది. ఇన్‌స్టాలో భారీగానే ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న అనసూయ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా లైట్ పింక్ కలర్ శారీతో దిగిన ఫోటోలను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ హెయిర్ స్టైల్, కట్టుబొట్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్, నైస్, అదిరిపోయింది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అనసూయ పొట్టి డ్రెస్సులే కాదు శారీస్ కట్టుకొని దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. నటనే కాదు అందంలో కూడా తనకు తానే సాటి అన్నట్లుగా స్మైలీ ఫేస్‌తో గ్లామర్ లుక్స్ ఇస్తున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. వీకెండ్ కోసం చేస్తున్న షూటింగ్ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది అనసూయ. చీరకట్టులో తన ఒంపు, సొంపులు, అంద చందాలను ఒలకబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.