Ananya Panday : చుంకీ పాండే కూతురిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు ఇటీవల చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఖో గయే హమ్ కహాన్ ను షూట్ చేస్తున్నప్పుడు తన లైఫ్ కి సంబంధించిన ఫోటోషూట్ ని తన ఫాలోవర్స్ కి అప్ డేట్ చేస్తోంది. తాజాగా గెహ్రైయాన్ రోజులను గుర్తు చేసుకుంటూ.. అనన్య తన అందాలను పరిచయం చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. అనన్య పాండే గెహ్రైయాన్ షూటింగ్ డేస్ త్రోబాక్ బికినీ ఫోటోలు ఇవి. వీటిని చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

పిక్స్ లో అనన్య నీలిరంగు బికినీ ప్రింటెడ్ డిజైన్ తో కనిపించింది. అలీబాగ్ లో గెహ్రైయాన్ షూటింగ్ ఫొటోలు కాగా, వీటికి కంటిన్యూటీ ఫోటోలు అంత బ్యాడ్ కానప్పుడు.. త్రోబాక్ టు గెహ్రైయాన్ డేస్..!! అంటూ క్యాప్షన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ కి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. అనన్య మరింత గ్లామర్‌గా కనిపిస్తోందంటూ కామెంట్లతో వెబ్ ని హీటెక్కిస్తున్నారు. ఇక పెద్ద తెరపై అనన్య.. సిద్ధాంత్ తో రొమాన్స్ ని అదరగొట్టిందన్న టాక్ ఉంది.
లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది – ఆదర్శ్ గౌరవ్లతో కలిసి ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రం చేస్తోంది. ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రేమ వ్యవహారం బయటపడింది. ఇన్నాళ్లూ సినిమాల్లోనే బిజీగా ఉందనుకున్న ఈ హీరోయిన్ స్టార్ హీరో తమ్ముడితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీ -టౌన్ లో పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ ప్రేమ వ్యవహారంకి ఫుల్‌స్టాప్ కూడా పడిందనే ప్రచారం కూడా నడుస్తోంది.