Rocket Leaf : రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ రక్తం గడ్డకట్టి రక్తనాళంలో ఇరుక్కున్నా, రక్త ప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి చేరినా ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెలోని సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి దీని నుండి బయటపడడానికి ముందు జాగ్రత్తగా ఇతర దేశాల్లో 20, 25 సంవత్సరాల వయసు నుంచి ఆస్ప్రిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు.
ఇలాంటి టాబ్లెట్స్ ని మనదేశంలో ఎకోస్ప్రిన్ అని డాక్టర్లు కొంచెం బీపీ ఎక్కువ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా లైఫ్ టైం వాడాలని చెబుతున్నారు. రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి నేచురల్ గా ఒక ముఖ్యమైన ఆకు ఉంది. అదే రాకెట్ ఆకు. దీనిని పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. సలాడ్స్ లో స్మూతీస్ లో వాడుకోవచ్చు. ఈ ఆకు మెదడులోనూ గుండెలోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు. దీనిలో పాలీ గ్లైకోసీటెడ్ ఫ్లేవన్స్ ఉండటం వల్ల రక్తంలోని ప్లేట్ లెట్స్ అన్నీ దగ్గరకు చేరి గడ్డ కట్టకుండా ఆపడానికి బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు.
రాకెట్ లీఫ్ లో నైట్రెట్, నైట్రైట్ ఉండడం వల్ల ఘాటుగా ఉంటాయి. ఇందులో ఉండే గ్లూకో సైనోలెట్స్ ముఖ్యంగా మజిల్ సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్లేలా చేసి రక్తంలో చక్కెరస్థాయి తగ్గించడానికి, టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. అండాశయాలలో నీటి బుడగలు రాకుండా చేయడానికి ఈ ఆకులు వాడుకోవడం చాలా మంచిది. అలాగే షుగర్ రాకుండా ఆపడానికి ఈ ఆకు ఉపయోగపడుతుంది. దీనిని శీతాకాలంలో ఇంట్లోనే విరివిరిగా పండించుకోవచ్చు. దీని విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…