Ponniyin Selvan 1 : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. పొన్నియిన్ సెల్వన్ 1. ఇందులో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు నటించారు. అలాగే బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఓ ముఖ్యపాత్రను పోషించింది. అయితే ఎన్నో అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకుల అంచనాలను మించి ఉందా.. సినిమా కథ ఏమిటి.. అలిరిస్తుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
అదిత కరికాలన్ (విక్రమ్) చోళ రాజ్యానికి రాజు. అతని ఆదేశాల మేరకు వల్లవరాయ (కార్తి) రాజ్యంలో మారువేషంలో తిరుగుతూ రాజ్యాన్ని ఎవరు దక్కించుకోవాలని కుట్ర పన్నుతున్నారు.. వంటి విషయాలను సేకరిస్తుంటాడు. అయితే చివరకు ఏమవుతుంది ? తన రాజ్యాన్ని కరికాలన్ ఎలా రక్షించుకున్నాడు..? దీనికి ప్రత్యర్థులు వేసిన ఎత్తులు ఏమిటి.. వాటిని కరికాలన్ ఎలా చిత్తు చేశాడు.. వంటి వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
బాహుబలి స్ఫూర్తితో మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో అగ్రశ్రేణి నటీనటులు ఉండడంతో యాక్టింగ్‌కు కొదువ లేదు. కార్తి, విక్రమ్, జయం రవి, పార్థిబన్, త్రిష, ఐశ్వర్యారాయ్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, అక్కడక్కడా వచ్చే యాక్షన్ సీన్లు అలరిస్తాయి. అయితే సినిమాలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మూవీ అందరు ప్రేక్షకులకు నచ్చదు.
మూవీలో చాలా వరకు పేర్లు తమిళ భాషకు చెందినవి ఉంటాయి. అందువల్ల సినిమా చూసిన ప్రేక్షకులకు సినిమా అనంతరం ఆ పేర్లు గుర్తుండవు. అలాగే అన్ని క్యారెక్టర్లు ఉన్నప్పటికీ వారి పేర్లు, వారి సన్నివేశాలు సినిమా చూశాక ప్రేక్షకులకు గుర్తుండవు. తమిళ ప్రేక్షకులకు అయితేనే మూవీ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వారి నేటివిటీకి చెందినది కనుక. బాహుబలి ఒక కల్పిత కథ. దీన్ని యూనివర్సల్ గా తెరకెక్కించారు. అందువల్ల అది అందరికీ నచ్చింది. కానీ పొన్నియిన్ సెల్వన్ 1 తమిళ ప్రాంతానికి చెందినది. కనుక ఆ ప్రభావం అందులో ఎక్కువగా కనిపిస్తుంది. వారి కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు అన్నీ తమిళ ప్రాంతానికి చెందినవిగా ఉంటాయి. కనుక తమిళ వాసన అందరికీ నచ్చకపోవచ్చు.
అయితే ఓవరాల్‌గా చూస్తే పొన్నియిన్ సెల్వన్ గొప్ప అనుభూతిని ఇస్తుంది. అయినప్పటికీ తమిళ నేటివిటీ అధికంగా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల ప్రేక్షకులు దాన్ని ఎలా స్వీకరిస్తారు.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమా మాత్రం ఆద్యంతం బోరింగ్‌గా సాగుతుంది. కనుక ఓపిక ఉంది.. కొత్తదనం కావాలి.. అనుకున్నవారు ఈ మూవీకి వెళ్లవచ్చు. లేదంటే చూడకపోవడమే మంచిది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…