Allu Arjun : అల్లు అర్జున్ ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన యాడ్స్ వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో ఆయన ర్యాపిడో బైక్ ట్యాక్సీ సంస్థకు యాడ్ చేశారు. అందులో ర్యాపిడోను బుక్ చేస్తే వెంటనే వస్తుందని.. ఆర్టీసీ బస్సు కూడా త్వరగా రాదని.. అన్నారు. దీంతో ఆ యాడ్ వివాదాస్పదం అయింది. తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ యాడ్‌పై స్వయంగా స్పందించారు. ఆ యాడ్ ను వెంటనే నిలిపి వేయాలని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన లీగల్ నోటీసులు పంపించారు.

దీంతో స్పందించిన ర్యాపిడో యాజమాన్యం ఆ యాడ్‌ను తొలగించి క్షమాపణలు చెప్పింది. ఆ యాడ్‌లో తెలంగాణ ఆర్‌టీసీని కించపరిచారని సజ్జనార్ పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇక తాజాగా అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదాస్పదం అవుతోంది. అందులో నటుడు సుబ్బరాజ్‌కు అల్లు అర్జున్ పంచ్ ఇస్తాడు. దీంతో సుబ్బరాజు కాసేపు గాలిలో అలాగే ఉంటాడు.
అయితే అదే సందర్భంలో అల్లు అర్జున్ జొమాటో గురించి చెబుతూనే.. సౌత్ ఇండియన్ సినిమాలు అంటే అంతే.. అలా గాల్లో కాసేపు ఉండాలి.. అంటాడు. అయితే అల్లు అర్జున్ ఇలా అనడం అనేక మంది సౌత్ ఇండియన్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఓ వైపు హిందీ ఆడియన్స్ పుష్ప సినిమాకు గాను సౌత్ ఇండియన్ సినిమాలను మెచ్చుకుంటుంటే.. మరోవైపు అల్లు అర్జున్ ఇలా సౌత్ ఇండియన్ సినిమాలను కించ పరిచేలా అలా యాడ్‌లో నటించడం.. డైలాగ్ చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.